సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల గతకొంత కాలంగా సినిమాలను నిర్మిస్తుంది. మహేష్ కెరీర్ లోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాలో ఆమెకు కొంత భాగస్వామ్యం వుంది. అంతేకాక ఆమె గౌతం మీనన్ తెరకెక్కించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా తెలుగు వెర్షన్ ను కుడా తెరక్కెక్కించింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుని, హిట్ చిత్రంగా నిలిచింది. కొన్ని సెంటర్ లలో 100 రోజులు ప్రదర్శించి నాగచైతన్యకు మొదటి భారీ విజయాన్ని అందించింది. సమంత వెండితెరపై వెలుగుతుంది అంటే అది ఈ సినిమా వలనే. కాకపోతే ఈ సినిమా హిట్ అయినా మంజులకు 2కోట్లు నష్టం వచ్చిందని కృష్ణ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. పంపిణీదారుల వ్యవస్థలో వున్న లోపమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాను భారీ నిర్మాణ సంస్థ అయిన ‘యు.టి.వి’ సంస్థతో కలిసి మంజుల నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు త్వరలోనే తెలుపుతాం