మరో హిందీ సినిమాకు సంతకంచేసిన ఇలియానా

illeyana
‘బర్ఫీ’ సినిమాతో బాలీవుడ్ కు విజయవంతమైన ఎంట్రీని ఇచ్చిన ఇలియానా నిమ్మదిగా అక్కడ తన ఉనికిని చాటుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం ఇలియానా బాలీవుడ్ లో డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను అంగీకరించిందట
‘మైన్ తేరా హీరో’ అనేది ఈ చిత్రం యొక్క టైటిల్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా హీరో వరుణ్ ధావన్ ఇందులో హీరో. ప్రస్తుతం ఈ జీరో సైజ్ భామ రాజ్ & డి.కె ల ఆధ్వర్యంలో ‘హ్యాపీ ఎండింగ్’ అనే సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్ సరసన నటిస్తుంది. ఈమె షాహిద్ కపూర్ తో కలిసి నటించిన గత చిత్రం ‘ఫటా పోస్టర్ నిఖలా హీరో’ బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది

Exit mobile version