యాంటి పైరసీ విషయంలో సీరియస్ అయిన దిల్ రాజు

dil-raju
నిర్మాత దిల్ రాజు రామయ్యా వస్తావయ్యా యాంటి పైరసీ విషయంలో బాగా సీరియస్ అయ్యారు. ఈ రోజు సాయంత్రం మీడియాతో సమావేశమైన దిల్ రాజు పైరసీ సిండికేట్ విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్న కొంతమంది ఫోటోలను, వారికి సంబందించిన వివరాలను తెలియజేశారు. అలాగే ఎపి ఫిల్మ్ చాంబర్ యాంటి పైరసీ సెల్ తో కలిసి ఎలాంటి పైరసీలు రాకుండా చూస్తున్నట్లు దిల్ రాజు తెలియజేశారు.

డైరెక్టర్ హరీష్ శంకర్ పైరేట్ కాపీల్లో సినిమా చూడొద్దని తెలియజేశాడు. ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. మీకు ఎక్కడన్నా పైరేట్ కాపీలు కనపడితే వారి వివరాలను కింద ఇచ్చిన మెయిల్ ఐడికి గానీ, ఫోన్ నెంబర్లకి గానీ తెలియజేయమని అభిమానులను కోరారు.

మెయిల్ ఐడి : rv@apfilmchamber.com

ఫోన్ నెంబర్స్ : 040- 23547823

9000401020

9000401030

Exit mobile version