43 సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర ప్రేక్షకులను తన వైవిధ్యభరితమైన నటనతో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న నటుడు కమల్ హాసన్. గతంలో ‘విశ్వరూపం’ చూపించిన ఆయన ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ‘విశ్వరూపం 2’ కు తుది మెరుగులు దిద్దుతున్నాడు
ఈ సినిమా తరువాత కమల్ మనకు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఆ భారీ బడ్జెట్ చిత్రాన్ని లింగుస్వామి నిర్మించనున్నాడు. కమల్ కు ఆప్తమిత్రులలో ఒకరైన నటుడు రమేశ్ అరవింద్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “నేను ఇదివరకే ‘సతీలీలావతి’ కన్నడ రీమేక్ లో కమల్ ను హీరోగా పెట్టి దర్శకత్వం వహించాను. ఇప్పుడు ఈ కినేమాను అంగీకరించాము. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతాం”అని అన్నారు
ఈ సినిమా యాక్షన్ కామెడీ ఎంటెర్టైనర్ నేపధ్యంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కే సూచనలు వున్నాయి