హీరో, నటుడు శ్రీ హరి ఇకలేరు..!

Srihari-is-no-more
మేము మా పాఠకులకి ఓ షాకింగ్ మరియు బాధాకరమైన విషయం చెబుతున్నాం. 49 సంవత్సరాలు వయసుగల రియల్ స్టార్ శ్రీ హరి ఈ రోజు చనిపోయారు. గత కొంత కాలంగా శ్రీ హరి కాలేయ సమస్యతో భాదపడుతున్నారు. ముంబైలోని లీలావతివతి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన భార్య డిస్కో శాంతిమరియు ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఫైటర్ గా, చిన్న చిన్న విలన్ పాత్రలు చేస్తూ కెరీర్ ని ప్రారంభించిన శ్రీ హరి అనతి కాలంలోనే తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా హీరోగా కూడా చాలా సినిమాలు చేస్తున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు.

శ్రీ హరి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘మగధీర’, ‘డీ’, ‘బృందావనం’, ‘కింగ్’, ‘డాన్ శీను’ లాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని పాత్రలను చేసారు. అలాగే హీరోగా కూడా ‘పోలీస్’, ‘భద్రాచలం’, ‘అయోధ్య రామయ్య’, ‘బలరాం’, ‘హనుమంతు’ లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకి గాను నంది అవార్డు ని కూడా అందుకున్నాడు.

ఈ విషయంలో చాలా బాధపడుతున్న 123తెలుగు.కామ్, ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ విషయంలో శ్రీ హరి గారి కుటుంబ సభ్యులకు ఆత్మ స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం.

Exit mobile version