తమిళ హీరోలని పొగిడేస్తున్న కాజల్ అగర్వాల్

kajal
అటు అందం పరంగా, ఇటు నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ కి సౌత్ సినిమా రంగంలో మంచి క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం ‘నాయక్’, ‘బాద్షా’ చిత్రాలతో తెలుగులో హిట్స్ అందుకున్న కాజల్ మరో కొత్త సినిమాకి సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తమిళ హీరోలని పొగిడెస్తోంది.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కార్తీ సరసన ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజ’, విజయ్ సరసన ‘జిల్లా’ సినిమా చేస్తోంది. కార్తీ మూవీ ‘ఆల్ ఇన్ ఆల్ అజుగు రాజ’ గురించి చెబుతూ ‘ఇది ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ చేస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కార్తీ నటన మీద మంచి పట్టున్న నటుడు. అతను చేసే సీన్స్ లో అతని పెర్ఫెక్షన్ చూసి నేను చాలా నేర్చుకున్నానని’ అంటోంది.

విజయ్ జిల్లా గురించి చెబుతూ ‘ విజయ్ తో కలిసి తుపాకి లాంటి హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ విజయ్ తో చెయ్యడం చాలా అందంగా ఉంది. అసలు నేనెంతో ఉత్కంఠతో షూటింగ్ చేస్తున్నాను. ఇందులో నేను యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేస్తున్నానని’ చెప్పింది.

Exit mobile version