‘ఇద్ధరమ్మాయిలతొ’ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన అమలాపాల్ ఆ సినిమా తరువాత దక్షిణాదిన మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని ప్రస్తుతం వాటి షూటింగ్ పనులలో బిజీగా వుంది
ఇప్పుడు అమలా మరో కొత్త సినిమాను అంగీకరించింది అంటూ పుకార్లు వచ్చాయి. దానికి అమలాపాల్ తనదైన రీతిలో సమాధానమిస్తూ “నేను కొత్త సినిమాను అంగీకరించానన్న ఊహలు జింబాబ్వే ప్రపంచ కప్ గెలిచిందన్నవాటితో సమానం” అని ట్వీట్ ఇచ్చింది. ఎటువంటి సినిమాను ఒప్పుకున్నా ముందుగా మీడియాకే తెలియజేస్తానని కుడా తెలిపింది. దీంతో పుకార్లకు అంతం పలికింది
ప్రస్తుతం ఈ సరసన ‘జెండా పై కపిరాజు’ అనే ద్విభాషా చిత్రంలోకాక మరో మూడు తమిళ సినిమాలలో నటిస్తుంది