విలక్షణ నటుడిగా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న గొల్లపూడి మారుతి రావు కొన్ని వర్గాల ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరమవుతున్నారని ఫీలవుతున్నారు. ఈ మార్పు బాధాకరమైనదని ఆయన ఫీల్ అవుతున్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన 26వ ఢిల్లీ తెలుగు అకాడమీ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన ఈ మాటలు అన్నారు.
” నేను మూడు తరాలకు సంబందించిన రచయితలు, నటులు, టెక్నీషియన్స్ తో పనిచేసాను. ప్రస్తుతం తెలుగు సినిమా రంగం పూర్తిగా కమర్షియల్ గా మారిపోయింది. దానివల్ల కొన్ని వర్గాల ప్రేక్షకులు తెలుగు సినిమాకి దూరమవుతున్నారు. ఇది చాలా భాధాకరం అని’ మారుతి రావు తన ఆవేదనని వ్యక్తం చేసారు.
ఆ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరైన జస్టిస్ జస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ ” సినిమా అనేది ఒక వ్యాపారాత్మక కళ. గతంలో లక్షల లాభం కోసం సినిమాలు తీసేవారు, ఇప్పుడేమో కోట్ల కోసం తీస్తున్నారు. అయితే లాభం కోసం ఎలాంటి లిమిట్స్ ని పాటించాలి అన్నదే ప్రధానం అని” ఆయన అన్నారు.