రోజాకి తన సోదరుడి నుచి పొంచి ఉన్న ముప్పు.!

roja
ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రోజా ఆ తర్వాత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంది. ఆ తర్వాత రాజకీయాలను కాస్త పక్కన పెట్టిన ఆమె ప్రస్తుతం సినిమాల్లో కొన్ని కీలక పాత్రలు చేస్తూ,అలాగే టీవీ షో లతో బిజీ బిజీగా ఉంటోంది. ఇలా బిజీ బిజీగా ఉన్న రోజాకి సడన్ గా ప్రాణభయం ఏర్పడింది.

అసలు విషయంలోకి వెళితే డబ్బులు కోసం తన సోదరుడైన వై. రామ్ ప్రసాద్ రెడ్డి, అతని మేనేజర్ ప్రసాదరాజు కలిసి డబ్బు కోసం తనని వేధిస్తున్నారని, వారివల్ల తనకు ప్రాణభయం ఉందని రాయదుర్గం పోలీసులకు పిర్యాదు చేసారు.

‘తన సోదరుడు ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు, దానిలో నుంచి బయట పడటానికి తనని డబ్బు ఇవ్వమని వేదిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి, ప్రసాదరాజు బెదిరిస్తున్నారని’ ఫిర్యాదులో రోజా వెల్లడించారు.

Exit mobile version