రచయతలు దర్శకులుగా మారడం నేటితరపు ట్రెండ్. ప్రస్తుతం ఒక రచయిత ఆ ట్రెండ్ ను ఫాలో అయ్యి దర్శకుడిగా మారే పనిలోవున్నాడు
తేజ, శివనాగేశ్వరరావు మరియు మారుతి వంటి ప్రముఖ దర్శకుల దగ్గర పనిచేసిన రామస్వామి దర్శకుడిగా మారనున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ “దాదాపు 40 చిత్రాలకు పనిచేసిన నేను ఆ అనుభవంతో ఒక మంచి కధను రాసుకున్నాను. ఈ కధ యూత్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ నేపధ్యంలో నవంబర్ నుండి షూటింగ్ ని ప్రారంభించనున్నా”మని తెలిపాడు
చాలా రోజులనుండి టాలీవుడ్ లో రచయతలకు వారి శ్రమకు తగిలిన గుర్తింపు రావడంలేదనే భావన నడుస్తుంది. అదే ఈ కొత్త ట్రెండ్ కు కారణమైవుండచ్చు. ఇలా వచ్చినవారిలో కొంతమంది విజయపుబాట పట్టడం ఆనందకరం