రజనీకాంత్ రెమ్యునరేషన్ 2500: భారతి రాజ

Rajnikanth-BharathiRaja
రజనీకాంత్, కమల్ హాసన్ తమిళ చిత్ర సీమ లో గొప్ప నటులు. వీరికి ఇతర దేశాలలో కూడా గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి కెరీర్ మొదట్లో చాలా ముల్టీ స్టారర్ చిత్రాలలో నటించి ఒకరిపై ఒకరికి వున్న అభిమానాన్ని చాటుకున్నారు

అలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలలో ’16 వయాధినిలే’ సినిమా ఒకటి. 36 సంవత్సరాల తరువాత ఈ సినిమాను డిజిటల్ రూపంలోకి మార్చనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ వేడుకలో నిన్న రజిని మరియు కమల్ పాల్గున్నారు. ఈ సంధర్భంగా దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ “ఈ సినిమా కోసం కమల్ కు 27000 ఇస్తే రజిని కి 2500 ఇచ్చాము. ఇప్పుడు ఆయన దక్షిణాదిన అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న నటుడు కావచ్చు. కానీ అప్పటికీ ఇప్పటికీ అతనిలో ఏ మార్పూ లేదు” అని తెలిపారు

ఈ సినిమా అన్నీ భాషల్లో విజయవంతమయ్యింది. తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’గా అనువాదం అయ్యింది. త్వరలో ఈ డిజిటల్ చిత్రాన్ని విడుదలచెయ్యనున్నారు

Exit mobile version