రాత్రివేళల్లో షూటింగ్ లను ప్రోత్సాహించానన్న హీరోయిన్

charmi
తెలుగులో దాదాపు అందరు అగ్రతారాలతో నటించడమే కాక మహిళా ప్రాధాన్యమున్న సినిమాలలో కూడా ఛార్మీ నటించింది.తన కెరీర్ మొత్తంలో ఆమె ఖాతాలో చెప్పుకోదగిన హిట్ లను జమచేసుకోగలిగింది

ప్రస్తుతం ఆమె మరో మహిళా ప్రాధాన్యమున్న సినిమాలో నటిస్తుంది. ఆ సినిమానే ‘మంత్ర 2’. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా హర్రర్ నేపధ్యంలో సాగనుంది గనుక షూటింగ్ ఎక్కువగా రాత్రి వేళల్లో జరుగుతుంది. దీని గురించి ఈ భామ మాట్లాడుతూ “నేను సాధారణంగా రాత్రి వేళల్లో షూటింగ్ లకు దూరంగా వుంటాను. కానీ ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం రాత్రిళ్ళు మాత్రమె చిత్రీకరణ జరుపుకోవాలి. కాబట్టి నేనేం ఆంక్షలు విధించలేదు” అని తెలిపింది

ఆమెకు ‘మంత్ర 2’ లో నటిస్తుండడం బాగా నచ్చిందట. ఈ సినిమాతో ఎస్.వి సురేష్ దర్శకుడిగా పరిచయంకాబోతున్నాడు. బోనాల శ్రీకాంత్ మరియు రవితేజ ఈ చిత్రానికి సంయుక్త నిర్మాతలు

Exit mobile version