నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘లెజెండ్’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. మేము ముందుగా తెలిపినట్టే ఈ సినిమా షూటింగ్ నానాక్రాంగూడ ఏరియాలో జరుగుతుంది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. నానాక్రాంగూడ లో షూటింగ్ కోసం ఒక భారీ ఇంటి సెట్ ను వేసారు. ఈ సెట్ సినిమాలో బాలకృష్ణ నివాసంగా చుపించానున్నారని సమాచారం . బయట చక్కని గార్డెన్ ను కుడా అలకరించారు
ఈ సినిమాకు బోయపాటి శీను దర్శకుడు. ఈయన బాలయ్య బాబుతో కలిసి రెండోసారి పనిచేస్తున్నాడు. ఇదివరకు వీరి కలయికలో వచ్చిన ‘సింహా’ సినిమా విజయవంతంగా నిలిచింది . ఈ ‘లెజెండ్’ లో జగపతిబాబు విలన్ కావడం ప్రత్యేకఆకర్షణ. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు
రాధికా ఆప్టే మరియు సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. ఈ భారీ బడ్జెట్ మాస్ చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మిస్తున్నారు