2013 తెలుగు ఫిల్మ్ హీరోలకి బాగా కలిసొచ్చిన సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాదాపు అందరు హీరోలు తమ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు.జనవరిలో రామ చరణ్ ‘నాయక్’ సినిమాతో సక్సెస్ అందుకుంటే, వెంకటేష్ – మహేష్ బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. సమ్మర్లో ఎన్.టి.ఆర్ ‘బాద్షా’గా వచ్చి హిట్ కొట్టాడు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు.
చాలా రోజుల తర్వాత రవితేజ ‘బలుపు’తో సక్సెస్ కొడితే, నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో వరుసగా రెండవ హిట్ అందుకున్నాడు. మంచు మనోజ్ ‘పోటుగాడు’ గా, నాగ చైతన్య ‘తడాఖా’ చూపించి హిట్స్ అందుకున్నారు. కానీ అందరి కంటే స్ట్రాంగ్ గా పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
మీరు మొత్తంగా చూసుకుంటే టాలీవుడ్ బడా హీరోలందరూ తాము రిలీజ్ చేసిన సినిమాలతో విజయాన్ని అందుకున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే బాగా ఫెయిల్యూర్ ఎక్కువగా ఉండే టాలీవుడ్ లో 2013 లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది.
ప్రస్తుత మరికొన్ని పెద్ద సినిమాలు రానున్న రెండు నెలల్లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకొని ఈ సంవత్సరం తెలుగు హీరోల పరంపర ఇలానే కొనసాగాలని ఆశిద్దాం.