ప్రతీ హీరో అభిమానులూ అత్తారింటికి దారేదికి జరిగిన నష్టాన్ని తమ కష్టంగా భావిస్తున్నారు

AD

తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో ఈరోజును బ్లాక్ డే గా అభివర్ణించవచ్చు. ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుధలకుముందే ఈ సినిమా యొక్క మొదటి 90 నిముషాలు పైరసీ రూపంలో సి.డి ల ద్వారా కృష్ణ జిల్లా, కర్ణాటక రాష్ట్రంలో పలుచోట్ల హల్ చల్ చేసాయి. ఈ వీడియో ను ఆన్ లైన్ లో కూడా పెట్టారు

కానీ ఈ సంఘటన ద్వారా టాలీవుడ్ లో ఒక విప్లవం తెరలేచింది. తమ హీరో కోసమే తమ తమ అభిమానులు కష్టపడతారు అన్ని అపవాదు తొలగిపోయింది. చాలా మంది ఇతర హీరోల అభిమానులు పోలీసులకు సహకరించి ఈ దారుణాన్ని మరింత దారుణంగా అడ్డుకున్నారు. పలు హీరోల అభిమానులనుండి కొన్ని వందల సంఖ్యలో ఈ వీడియోల లింక్ లు ట్వీట్ల రూపంలో అందించారు. పవన్ అభిమానులు కాని వారు సైతం సి.డి షాప్ లను రాయిడ్ చేసి ఈ వీడియో సి.డి లను సీజ్ చేసారు

దీని ద్వారా ఏ హీరోకి చివరికి తెలుగు సినిమా మేలు జరగాలని కోరుకునే వారిమే అని మనవాళ్ళు చూపించారు. పైరసీ ని అరికట్టడానికి ఇటువంటి చర్యలు ఇక ముందు జరుగుతాయని ఆశిద్దాం

Exit mobile version