మహేష్ బాబు నటిస్తున్న ‘1 నేనొక్కడినే’ సినిమా జనవరి 10, 2014 న విడుదలవుతుంది అని ప్రకటించారు. చెప్పిన సమయంలో ఎలాగైనా సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర బృందం భారీ షెడ్యూల్లను శరవేగంగా పూర్తిచెయ్యాలని భావిస్తున్నారు
రెండు నెలల క్రితం లండన్ లో ఒక షెడ్యూల్ ను ముగించుకునిఈరోజు వరకూ హైదరాబాద్ లో చిత్రీకారణ జరుపుకుంది. ఈరోజుతో ఆ హైదరాబాద్ షెడ్యూల్ ను కూడా ముగించుకుని ఈ నెల 23 న బ్యాంకాక్ బయల్దేరనుంది. అక్కడ ఏకధాటిగా 40 రోజలు చిత్రీకరణ జరుపుకుంటుంది
ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ మొదటిసారిగా మహేష్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మొదటి లుక్, టీజర్ తో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. వాటిని తప్పకుండా అందుకుంటామని చిత్ర నిర్మాతలైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ధీమాగా వున్నారు