కమల్ ఖాతాలో మరో పురస్కారం

kamal-haasan

భారతదేశంలోనే అధ్బుతమైన నటులలో కమల్ హాసన్ ఒకరు.భారతదేశంలో పలు భాషలలో చాలా సినిమాలను నిర్మించి, దేశ నటీనటులకు తలమానికంగా నిలిచారు. విలక్షణ నటనకు ఆయన దక్కించుకున్న పురస్కారాలకు కొదవే లేదు. ఇప్పుడు ఆయన కిరీటంలో మరో వజ్రం చేరనుంది. ముంబై అకాడమి ఆఫ్ మూవింగ్ ఇమేజస్ సంస్థ నిర్వహించనున్న 15వ అవార్డుల వేడుకలో ఈ నెల 17న ఆయన ఒక అవార్డును స్వీకరించనున్నారు

నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా, రచయితగా ఎన్నోసినిమాలకు సేవలందించిన కమల్ కు ఈ సంస్థ జీవన సాఫల్యపురస్కారాన్ని అందించనున్నారు. ప్రముఖ దర్శకుడు శ్యాం బెంగాల్ ఈ వేడుకకు చైర్ మెన్. ఆయన ఈ అవార్డుకు గానూ కమల్ ను ఎంపిక చేసినందుకు ఆనందం వ్యక్తం చేసారు

Exit mobile version