29న స్పెయిన్ వెళ్లనున్న నితిన్

znithin
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – యంగ్ హీరో నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ అటాక్’. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 16 నుంచి స్పెయిన్ జరగాల్సి ఉంది. కానీ మధ్యలో 100 సంవత్సరాల ఇండియన్ సినిమా వేడుకలు ఉన్నందువల్ల షెడ్యూల్ 29కి వాయిదా పడింది.

నితిన్ – ఆదా శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి నిర్మాత – డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మూవీలో నితిన్ కి ఓ సరికొత్త పాత్రని పూరి రాసారని సమాచారం. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్.

Exit mobile version