గత కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘సెకండ్ హ్యాండ్’ ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ఆడియోని ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాత బివిఎస్ రవి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రవి చంద్ర ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగే సెకండ్ హ్యాండ్ లో లవ్ అండ్ బ్రేకప్స్ లాంటి విషయాలను చూపించనున్నారు. ధన్య బాలకృష్ణన్, సుదీర్ వర్మ, కిరీటి, అనూజ్రాం, విష్ణు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి కిషోర్ తిరుమల డైరెక్టర్. అవనీంద్ర సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి ఎస్ఆర్ శేఖర్ ఎడిటర్.