రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు పొందిన డైరెక్టర్ లలో ఒకరు. ఆయనకి ప్రజల్లో ఒక పెద్ద స్టార్ కు ఉన్నత ఫాలోయింగ్ వుంది. అయన సమాజం పై భాద్యత కలిగిన వ్యక్తి. ఆయన గతంలో తను చేసిన పనులే అందుకు నిదర్శనం. ఉదాహరణకి తను ఇంతకు ముందు యువకులలో దైర్యాన్ని ఉత్సాహాన్ని నింపడానికి ఏర్పాటు చేసిన ‘యంగిస్థాన్’ కార్యక్రమాన్ని ముఖ్య అతిదిగా వెళ్ళడం జరిగింది అక్కడికి వచ్చిన వారిలో దైర్యాన్ని నిప్పారు. అలాగే ఆయన రాష్ట్ర విభజన గురించి ట్విట్టర్ ఒక ట్విట్ చేయడం జరిగింది. అది రాష్ట్రాన్ని విభాజించాలను కుంటే విభజించండి లేదా వచ్చే సంవత్సరం జరిగే సాదారణ ఎన్నికలు వరకు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని విభజించిన, అలాగే ఉంచిన తెలుగు వారు మాత్రం ఒకే ఐక్యతగా కలిసి వుండాలని కూడా ఆయన కోరడం జరిగింది.