ఇస్తాంబుల్ అందాలను పొగడిన నవదీప్

Navdeep-Tweet

నటుడు నవదీప్ కి ఆడవారిలో మంచి క్రేజ్ వుంది. తనకి చాలా మంది లేడి ఫ్యాన్స్ కూడా వున్నారు. ప్రస్తుతం తను ఇస్తాంబుల్ లో వున్నాడు. తను అక్కడి అందాలను, అక్కడి ప్రజలను గురించి అతని మనసులోని మాటలను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. “ఇస్తాంబుల్! ఇక్కడి అందాలను చూస్తుంటే దేవుడే దిగివచ్చి ఇక్కడి అందాలను సృష్టించడా అని అనిపిస్తోంది. నిజంగా చాలా అందంగా వున్నాయి”. అని ట్విట్ చేయడం జరిగింది. ఈ వారం మొదట్లో నవదీప్ దుబాయ్ లో జరుగుతున్న సీమ అవార్డ్ ప్రదానోత్సవానికి వెళ్ళడం జరిగింది. రెండు రోజులను నుండి అతను ఆ వేడుకలో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలని అక్కడ షో గురించి, నిర్వాహకుల గురించి మాట్లాడుతూ తన సంతోషాన్ని తెలియజేశాడు.

తను నటించిన చివరి సినిమా ‘బాద్షా’. ఈ సినిమాలో తను ఒక మంచి పాత్రలో నటించాడు. తను నటించిన ‘బంగారు కోడిపెట్ట’ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం నవదీప్ ‘అంత నీ మయలోనే’, ‘పొగ’ సినిమాలలో నటిస్తున్నాడు.

Exit mobile version