ప్రస్తుత హీరోయిన్ల పాత్రలపై ఆనందంగావున్న కాజల్

kajal-agarwal

సినీరంగంలోకి వచ్చి నాలుగేళ్ళు గడుస్తున్నా చేతినిండా అవకాశాలతో ప్రస్తుతతరం తారలలో బిజీ హీరోయిన్ గా కాజల్ తన కెరీర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్ లో విజయ్ మరియు కార్తి సరసన నటిస్తుంది. ఇప్పటివరకూ కాజల్ ఇంకా ఏ తెలుగు సినిమానూ అంగీకరించలేదు. మొదట్లో కాజల్ మహేష్ నటిస్తున్న ‘1-నేనొక్కడినే’ సినిమాకు హీరోయిన్ గా అనుకున్నా డేట్లు కుదరక ఆ ఆఫర్ ను వదులుకుంది

ఈ భామ ప్రకారం హీరోయిన్ల పాత్రలు కేవలం పాటలకే పరిమితం అన్న మాట గతం అట. ప్రస్తుతం వస్తున్న కధలలో హీరోయిన్లకు కుడా ప్రాధాన్యత ఇస్తూ రాస్తున్నారు అని తెలిపింది. తానూ చేస్తున్న పాత్రలలో కుడా వైవిధ్యాన్ని చుపిస్తున్నందుకు ఆనందంగావుందని తెలిపింది

Exit mobile version