గ్లామరస్ గా తయారవుతున్న లక్ష్మీరాయ్

lakshmi-rai

‘బలుపు’ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో రవితేజతో కలిసి చిందేసిన లక్ష్మీరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. అందమైన ముఖారవిందంతో అబిమానులను సంపాదించుకున్న ఈ భామ కాస్త లావుగావుండడంతో నిర్మాతలు వెనక్కుతగ్గుతున్నారు. కానీ ఇదంతా ఇప్పుడు గతం కానుంది. లక్ష్మీరాయ్ ఇప్పుడు ఇదివరకటికన్నా స్లిమ్ గా తన తదుపరి సినిమాలలో గ్లామర్ ను పంచడానికి సిద్ధమవుతుంది. దీనికోసం రోజూ జిమ్ లో గంటలుతరబడి కష్టపడుతుంది.

లక్ష్మీరాయ్ ఇటీవలే ‘అరణామనై’ అనే తమిళ కినేమాను అంగీకరించింది. ఈ సినిమాకు సుందర్ సి దర్శకుడు. ఇందులో హన్సిక మరో హీరోయిన్. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు తమిళ సినిమాలు వున్నాయి. అంతేకాక ఈమె నటించిన ‘వీరప్పన్’ సినిమా తెలుగులోకి ఈ నెల 20నా అనువాదంకానుంది. ఈ సినిమాలో అర్జున్ హీరో.

Exit mobile version