ఎన్.టీ.ఆర్ తాజా చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఈరోజు ఈ సినిమా షూటింగ్ చారిత్రాత్మక ప్రదేశమైన తారమతి బరాదారిలో జరిపారు.
ముందుగా ఈ సినిమాను ఈ నెల 26నా విడుదలచేద్దాం అనుకున్నా రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నడుమ అనుకున్న తేదీకి విడుదల చేస్తారో లేదో తెలియదు.
ఇదిలా వుంటే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటించమని ఫ్యాన్స్ తొందరపెడుతున్నారు. ఐతే తాము విడుదల తేదీలను ప్రకటించే వరకూ అభిమానులు తొందరపడద్దు అని హరీష్ శంకర్ కోరాడు. మీరు ఎంత ఎదురుచూసినా సినిమా చూసాక ఆ ఎదురుచూపు మీకు నిరాశ కలిగించదని, అభిమానులకు సినిమా కనులపండుగ అని తెలిపాడు.
ఈ సినిమాకు దిల్ రాజ్ నిర్మాత. సమంత మరియు శృతిహాసన్ హీరోయిన్స్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.