క్లీన్ ఎంటెర్టైనర్ గా రూపుదిద్ధుకుంటున్న మారుతి-శిరీష్ ల కొత్త జంట

kotha-janta
మొదటి సినిమా ‘గౌరవం’తో ఒక మంచి ప్రయత్నంగా విమర్శకుల ప్రశంసలు పొందిన అల్లు శిరీష్ ఈసారి ప్రేక్షకుల ముందుకు ‘కొత్త జంట’ అనే యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ తో రానున్నాడు. ఈ సినిమాకు అపజయమే ఎరుగని మారుతి దర్శకుడు. ఎన్ని విజయాలు తనఖాతాలో వున్నా బూతు చిత్రాల దర్శకుడిగా మారుతికి ముద్రపడిపోయింది. ఇప్పుడు అల్లు శిరీష్ చిత్రంతో ఆ పంధానుండి బయటకురావడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ వస్తుందని అల్లుశిరీష్ భావిస్తున్నాడు. యువత ప్రాధాన్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా సినిమాలో ఒక్క స్మోకింగ్ సీన్ కు గానీ, డ్రింకింగ్ సీన్ కు గానీ తావు ఇవ్వలేదట. శిరీష్ ఒక షెడ్యూల్ ను ముగించుకుని రెండు వారాల తరువాత బృందంతో కలవనున్నాడు. అంతేకాక మారుతి మరియు చిత్ర బృందంతో పనిచెయ్యడం అతనికి చాలా నచ్చిందని తెలిపాడు.

Exit mobile version