ఫుల్ కామెడీతో వస్తున్న ‘పోటుగాడు’

Potugadu
మంచు మనోజ్ కుమార్ హీరోగా నటించిన ‘పోటుగాడు’ సినిమా సెప్టెంబర్ 14న విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో విడుదలకావడానికి సిద్దంగా వుంది. ఈ సినిమాలో చాలా కామెడీ సన్నివేశాలు వున్నాయని సమాచారం. ఈ కామెడీ తెలుగు ప్రేక్షకులందరికి నచ్చుతుందని ప్రొడక్షన్ టీం బావిస్తున్నారు. అలీ, రాఘుబాబు, పోసాని, శ్రీనివాస్ రెడ్డి, తాగుబోతు రమేష్, మొదలగు వారు ఈ సినిమాలో చాలా చక్కని కామెడీ పండించారు. సిమ్రాన్ కౌర్, సాక్షి, అను ప్రియ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి అచ్చు సంగీతాన్ని అందించాడు. పవన్ వాడేయార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామదూత సినీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది.

Exit mobile version