అందరు ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కొచ్చాడియాన్’ సినిమా విడుదల తేది ఖరారైంది. ఈ భారీ బడ్జెట్ సినిమా డిసెంబర్ 12 వ తేది రజనీకాంత్ 63వ పుట్టిన రోజు సందర్బంగా విడుదలకానుంది. ఈ విషయాన్ని ఈ సినిమా కో – ప్రొడ్యూసర్ డా. మురళి మనోహర్ తెలియజేశారు. దీపిక పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోని అక్టోబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో ‘విక్రమ సింహ’ పేరుతో డబ్ చేయనున్నారు.