ఒకప్పటి కాలంలో అగ్రతారాలకు ధీటైన పోటీను ఇచ్చిన హీరోలలో జగపతిబాబు ఒకరు. ముఖ్యంగా ఆయనకు మహిళా అభిమానులు ఎక్కువ.
కాకపోతే ఒకేసారి వరుస ఫ్లాపులతో ఆయన కెరీర్ నిమ్మదించింది. అందుకని ఇప్పటివరకూ పోషించని విలన్ పాత్రకు సైతం అంగీకారం తెలిపారు.
హీరో పాత్ర కాకుండా మరో పాత్రలో నటిస్తున్నప్పుడు ఎధురయ్యే అవాంతరాలు, ఒడిధుడుకులు ఆయనకు తెలుసని, అవన్నీ అధిగమించి మంచి విలన్ గా నన్ను నేను నిరూపించుకుంటానని తెలిపారు.
మీరు ఫలానా పాత్రకోసం ఎవర్నైనా ఎప్పుడైనా సంప్రదించారా అని అడగగా “నేను ఇండస్ట్రిలోకి వచ్చి దాదాపు 25యేళ్ళు అవుతుంది. ఇప్పటివరకూ నేను ఏ దర్శకుడిని గానీ, నిర్మాతనుగానీ పాత్రకోసం కోరలేదు. నా దగ్గరకు వచ్చి, నాకు నచ్చిన పాత్రలను నేను చేశాను. ఏ పని లేకపోతే కాళీగా ఇంట్లోనే గడుపుతాను. ఇకమీదట కూడా ఆదే చేస్తాను” అని తెలిపాడు ఇంతముక్కుసూటి తత్వమున్న జగపతిబాబు విలన్ పాత్రలోసైతం రాణించాలని కోరుకుందాం.