త్వరలో టాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్న సుద్ధ్ దేశి రొమాన్స్ హీరోయిన్

vaani_kapoor
“సుద్ధ్ దేశి రొమాన్స్” సినిమాద్వారా బాలీవుడ్లో తెరారంగ్రేటం చేస్తున్న హీరోయిన్ వాణికపూర్. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. విశేషమేమిటంటే ఈ భామ త్వరలో టాలీవుడ్లో కూడా మెరవనుంది. ఈమె నానీ సరసన జంటగా నటిస్తూ తెలుగుతెరకు పరిచయంకానుంది. వీరిద్దరూ నటిస్తున్న ఈ సినిమా ‘బ్యాండ్ భాజా బారత్’ కు రీమేక్. ఈ సినిమాతో యష్ రాజ్ ఫిల్మ్స్ యొక్క నిర్మాణసంస్థ టాలీవుడ్లోకి కూడా ప్రవేశించనుంది. ‘సుద్ధ్ దేశి రొమాన్స్’ సినిమాకు కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థే నిర్మాత.

ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ కు కాస్త భిన్నంగావుంటుందని, నేను, నానీ హిందీలో చూసిన పాత్రలకు ప్రభావితంకాకుండా నటిస్తామని వాణి తెలిపింది

Exit mobile version