మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన ‘జంజీర్’ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ రోజు రాత్రి ముంబైలో ఈ మూవీ ప్రీమియర్ షో వెయ్యనున్నారు కానీ ఇప్పటికే బాలీవుడ్ లో ఫేమస్ అయిన కొంతమంది విమర్శకులు ఈ సినిమాని చూసారు. వాళ్ళందరూ రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సుభాష్ కె ఝా మరియు తరన్ ఆదర్శ్ రామ్ చరణ్ ని పొగిడారు. ‘ చరణ్ కి సూపర్బ్ టాలెంట్ ఉంది. చరణ్ మొదటి సినిమా ‘జంజీర్’ తో ఆకట్టుకున్నాడని’ తరన్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు. ‘బాయ్స్ మధ్యలో ఉన్న మాన్’ అని సుభాష్ కె ఝా ట్వీట్ చేసాడు.
మెగా ఫ్యామిలీ వాళ్ళంతా రిలీజ్ కి ముందే మంచి రిపోర్ట్స్ రావడం తో సినిమా రిలీజ్ కోసం ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చరణ్ బాలీవుడ్ లో తన స్టామినా చూపించనున్నాడా? లేదా అనే దానికోసం మరి కొద్ది గంటలు వేచి చూడాలి. కానీ ఒక తెలుగు హీరోని బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన విమర్శకులు ప్రశంశించడం అనేది చెప్పుకోదగ్గ విషయం.