తుఫాన్ కి పోలీస్ ప్రొటక్షన్ ఇమ్మన్న హై కోర్టు

thoofan

అప్డేట్ 11:33 ఎఎం : ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు రేపు రిలీజ్ కానున్న జంజీర్/తుఫాన్ సినిమాకి థియేటర్స్ వద్ద పోలీస్ ప్రొటక్షన్ ఇవ్వాలని డిజిపి కి ఆర్డర్స్ ఇచ్చింది. ఈ తీర్పు ఇండస్ట్రీలోని సభ్యులకు ఆనందాన్ని ఇచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘తుఫాన్’ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్రలో భారీ ఎత్తున జరుగుతున్న ఆందోళనల వల్ల ఈ మూవీకి సీమాంధ్ర ఏరియాలో కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఆస్తులను నష్టం చేస్తారేమో అని తుఫాన్ మూవీ ఎగ్జిబిటర్స్ భయపడుతున్నారు.

ఈ విషయంలో ఈ చిత్ర నిర్మాతలైన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఆంధ్రప్రదేశ్ హై కోర్టుని ఆశ్రయించి థియేటర్స్ కి పోలీసుల రక్షణ కావాలని కోరారు. ఈ పిటీషన్ ని ఈ రోజు హైకోర్టు విచారించనుంది. దాంతో సినీ వర్గాల వారంతా కోర్టు తీర్పు ఏమని ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ‘తుఫాన్’ సినిమా సమస్యల్ని ఎదుర్కోకుండా రిలీజ్ అయితే ఇప్పటి వరకూ ఆగిపోయి ఉన్న బిగ్ బడ్జెట్ సినిమాలు కూడా వరుసగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Exit mobile version