తాను ప్రత్యేక పాత్ర పోషించిన ప్రతీ సినిమా హిట్టవుతుందనే అరుదైన రికార్డును రియల్ స్టార్ శ్రీహరి సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన త్వరలో ‘జంజీర్’ తెలుగు వెర్షన్ అయిన ‘తుఫాన్’లో షేర్ ఖాన్ పాత్రను పోషించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ‘మగదీర’లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు, అందులో కూడా శ్రీహరి పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం విశేషం. పాత వెర్షన్ లో ప్రాణ్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి భర్తీ చేస్తున్నాడు.
ఈ సినిమాతో తనకున్న అనుబంధం గురించి శ్రీ హరి మాట్లాడుతూ “నేను ‘జంజీర్’ సినిమా చూసినప్పుడు దాదాపు నాకు ఎనిమిదేళ్ళు. ఆ సినిమాలో ప్రాణ్ తన అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన నటన నుండి ప్రాభవం చెందకుండా వుండడానికి ఈ మధ్య నేను ఆ సినిమా చూడలేదు. నా బాడీ లాంగ్వేజ్, నా మ్యానరిసమ్స్ తోనే ఈ పాత్రను పోషించాను” అని తెలిపాడు. ఈ సినిమాలో చరణ్ నటన తనకు నచ్చిందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపాడు