టాలీవుడ్ నటి రేఖారానా త్వరలో హాలీవుడ్ సీక్వెల్స్ సూపర్ హిట్ సిరీస్ లలో ఒకటైన ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్’ సినిమా 7 భాగంలో ఒక పాత్ర పోషించే అవకాశాలు వున్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారతీయ ముఖకవళికలు కలిగిన రాంసే పాత్రకు ఆడిషన్స్ జరిగాయి. ఈ పాత్ర సినిమాలో కీలకం కానుందని వినికిడి. కార్ వేగాన్ని అమాంతం పెంచే ఒక చీప్ తయారీలో ఈ పాత్ర తెరపై కనబడనుంది. రేఖ ఇప్పటికే రెండు హిందీ సినిమాలలోనే కాక ‘జూన్ పోతే జులై’ అనే తెలుగు చిత్రంలో నటించింది. ఈ పాత్రగురించి మాట్లాడుతూ “నా సినిమా కెనడాలో ప్రదర్శితం అవుతుంది అని వెళ్ళిన నేను అనుకోకుండా ఈ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్’ సినిమాకు తారలను ఎంపిక చేసే ఆండ్రూ వెబ్స్టర్ ను కలిసాను. అతనికి నేను నచ్చి ముంబైలో ఆడిషన్స్ కు పిలాచారని, ఇప్పటివరకూ ఎలాంటి పిలుపూ రాలేదుగానీ తనని మాత్రం ఎంపిక చేసుకుంటారనే నమ్మకం వుందని”తెలిపింది అంతే కాక ఈ భామకు రాంచరణ్ తో కలిసి నటించాలని కోరికట. రాజమౌళి తీసిన ‘ఈగ’ ఎంతగానో నచ్చిందట.