అందాల భామ నయనతార ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో మరో సినిమాకి సైన్ చేసింది. ఈ సారి జయం రవి సరసన నటించనుంది. ఇప్పటికే నయనతార నటిస్తున్న మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒక్క శేఖర్ కమ్ముల అనామిక సినిమా తప్ప మిగతా అన్ని సినిమాలు వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జయం రవి – నయనతార నటించనున్న ఈ సినిమాకి జయం రాజ డైరెక్టర్. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే జయం రవి తన బ్రదర్ జయం రాజ దర్శకత్వంలో ఆరోసారి కలిసి నటించనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో తెలుగు సినిమాలు తమిళ్లో రీమేక్ చేసారు, కానీ ఈ సారి వాళ్ళిద్దరూ ఓ కొత్త కథతో ప్రయోగం చేయనున్నారు. నయనతార ఈ ఆఫర్ రాగానే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఉందని సమాచారం. త్వరలోనే నయనతార అజిత్ హీరోగా, విష్ణువర్ధన్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తోంది అలాగే ఆర్యతో రాజ రాణి సినిమాలో నటిస్తోంది.