మలయాళీ బొమ్మ నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. శ్రీ ప్రియ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే చెన్నైలో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ షూట్ హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. నిత్యా మీనన్ ఈ మూవీ లో నర్స్ పాత్ర చేస్తోంది, తన కెరీర్లోనే చాలెంజింగ్ రోల్స్ లో ఒకటని తెలిపింది. ఈ సినిమాకి ‘మాలిని 22 విజయవాడ’ అనే టైటిల్ అనుకుంటున్న ఈ సినిమాలో క్రిష్ జె సత్తార్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రాజ్ కుమార్ సేతుపతి నిర్మిస్తున్న ఈ సినిమాకి అరవింద్ శంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా రిమ కల్లింగల్, ఫహద్ ఫాజిల్ నటించిన 22 ఫీమేల్ కొట్టాయం అనే మలయాళ సినిమాకి రీమేక్. ఈ సినిమాకి గాను రిమ కల్లింగల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకుంది. ఈ సినిమా కథ ఓ నర్స్ చుట్టూ తిరుగుతుంది, ఆమెని రేప్ చేసిన తర్వాత ఆమె జర్నీ ఎలా సాగింది అనేదే ఈ సినిమా కథాంశం. నిత్యా మీనన్ లాంటి టాలెంట్ ఉన్న ఓ నటి ఈ సినిమాలో నటిస్తుందంటే ప్రేక్షకులకు థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు.