సౌత్ ఇండియన్ సినిమా రంగానికి ఫిల్మ్ ఫేర్ ఇచ్చే అవార్డ్స్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2012 సంవత్సరానికి సంబందించిన 60వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వేడుక నిన్న హైదరాబాద్ నవోటల్లో ఎంతో వైభవంగా జరిగింది. ఈ సారి తెలుగులో ఒక్క ఈగ సినిమా నాలుగు అవార్డ్స్ సొంతం చేసుకోగా, గబ్బర్ సింగ్ మూడు అవార్డ్స్ ను దక్కించుకుంది. 2012కు గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో విజేతలుగా నిలిచిన విన్నర్స్ వివరాలు మీకందిస్తున్నాం..
ఉత్తమ చిత్రం | ఈగ |
బెస్ట్ డైరెక్టర్ | ఎస్ఎస్ రాజమౌళి (ఈగ) |
బెస్ట్ హీరో | పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్) |
బెస్ట్ హీరోయిన్ | సమంత (ఈగ) |
ఉత్తమ సంగీత దర్శకుడు | దేవీశ్రీ ప్రసాద్ (గబ్బర్ సింగ్) |
ఉత్తమ సహాయ నటుడు | సుధీప్ (ఈగ) |
ఉత్తమ సహాయ నటి | అమల అక్కినేని (లైఫ్ ఇస్ బ్యూటిఫుల్) |
ఉత్తమ సాహిత్య రచయిత | అనంత శ్రీరామ్ (ఏది ఏది – ఎటో వెళ్ళిపోయింది మనసు) |
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) | వడ్డేపల్లి శ్రీనివాస్ (పిల్లా నువ్వు లేని జీవితం – గబ్బర్ సింగ్) |
ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ (ఫీ మేల్) | సుచిత్ర (సారోస్తారా – బిజినెస్ మేన్) |
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ | చోట కె నాయుడు (ఢమరుకం) |
బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్ | ఈగ |
ఉత్తమ నృత్య దర్శకుడు | జాని (డిల్లకు డిల్లకు – రచ్చ) |
జీవిత సాఫల్య పురష్కారం | బాపు |