తమన్నా ఈమధ్య చాలా బిజీగావుంటుంది. ఆమె నటిస్తున్న ‘వినయాగం బ్రదర్స్’ సినిమా శరవేగంగా సాగుతుంది. ఆమె మొదటిసారిగా అజిత్ సరసన నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం యూరోప్ లో రెండు పాటలు చిత్రీకరణ జరుపుకున్నారు. ఒక రొమాంటిక్ మరియు మరొక ఫోక్ సాంగ్ ను షూట్ చేసారు. తమన్నా తమిళ్ లో ‘అయన్ (వీడొక్కడే)’, ‘పయ్యా(అవారా)’ పరిచయమైనా 2011 మధ్యనుండి తెలుగుకే ఎక్కువ పరిమితమయ్యింది. మరోసారి తమిళ రంగంలోకి ఒక ప్రవేశించనుంది. ‘శంఖం’, ‘దరువు’,’సిరుతాయ్’ వంటి సినిమాలను తీసిన శివ ఈ సినిమాకు దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు