ఓం3డికి హీట్ పెంచుతున్న నిఖీశా

Nikisha-Patel
నిఖీషా పటేల్ చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఓం’ సినిమాలో నిఖీషా తన అందాలతో ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనపడతానని తెలిపించి అలాగే బికినీలో కూడా కనిపిస్తానని చెప్పింది. ” మొదటి సారి నేను బికినీలో కనిపించానున్నాను. ఓం లో పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాను. ఓం 3డి ఈ నెల 19న రిలీజ్ అవుతుందని’ నిఖీషా ట్వీట్ చేసింది. చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ ‘పులి’ సినిమాలో కనిపించిన ఈ భామ తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఇంత కాలం వేచి చూసింది. ఓం సినిమాలో నిఖీషా అల్ట్రా గ్లామరస్ రోల్ లో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో కృతి కర్భంద కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సునీల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version