నవదీప్, స్వాతి జంటగా నటిస్తున్న ‘బంగారు కోడిపెట్ట’ ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతుంది. ముందుగా జూలై ద్వితీయార్ధంలో విడుదల చేద్దామనుకున్నా అది సాధ్యపడేలా లేదు. దర్శకుడు రాజ్ పిప్పాల మూడు విభిన్న కధలను ఒకే నేపధ్యంలో కలుపుతూ కధను అల్లుకున్నాడు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంతోష్ శోభన్ పిజ్జా డెలివరీ బాయ్ గా కనిపిస్తాడు. తాటి సునీత ఈ సినిమాను గురు ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. నిధి వేట(ట్రెజర్ హంట్) నేపధ్యంలో ఈ సినిమా సాగుతుంది. స్వాతికి సహాయపడే ఒక నెగిటీవ్ రోల్ లో నవదీప్ కనపడనున్నాడు. రొమాన్స్, కామెడీ మాత్రమే కాక ఒక కొత్త తరం సినిమాగా ఈ చిత్రం నిలవనుందట. స్క్రీన్ ప్లే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే మహేష్ శంకర్ అందించిన స్వరాలు సంగీత ప్రేమికులను అలరిస్తున్నాయి