‘బలుపు సినిమా మాస్ మహారాజ రవితేజ కెరీర్లోనే బెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా నైజాంలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా పి.ఆర్.ఓ చాలా తక్కువ టైంలో నైజాం ఏరియాలో 8 కోట్ల మార్క్ క్రాస్ చేసిందని తెలిపారు అలాగే ఈ ఏరియాలో రవితేజ కెరీర్లో బెస్ట్ ఫిగర్ ఇదేనని తెలిపారు. రవితేజ పెర్ఫార్మన్స్, శృతి హాసన్ గ్లామర్ బాక్స్ ఆఫీసు వద్ద ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడంతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని సక్సెస్ అయ్యాడు. బ్రహ్మానందం, అంజలి, ప్రకాష్ రాజ్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని పివిపి సినిమా బ్యానర్ వారు నిర్మించారు.