హిందీ, తమిల్లోకి వెళ్లనున్న సుదీర్ బాబు మూవీ

prema-katha-chitram2
సూపర్ స్టార్ కృష్ణ వంశం నుంచి టాలీవుడ్ కి పరిచయమైన సుదీర్ బాబు మొదటి సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయినా రెండవ సినిమా ‘ప్రేమ కథా చిత్రమ్’ మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళ్ మరియు హిందీ భాషల్లో కూడా రీమేక్ అవుతోంది. టాలీవుడ్ లో అందరికీ తెలిసిన ఆది శేషగిరి రావు బాలీవుడ్ హక్కులను దక్కించుకున్నారు, అలాగే ఆయన ప్రస్తుతం కొంతమంది బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. అలాగే తమిళ రీమేక్ రైట్స్ ని తమిళ నిర్మాత కాశి దక్కించుకున్నారు. ‘ఈ చిత్రానికి సంబందించిన రీమేక్ రైట్స్ ధరతోనే మేము ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేసిందని’ మారుథిఒ తెలిపాడు.

Exit mobile version