కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ మల్టీ స్టారర్ సినిమాని శ్రీ వాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ బ్యాంకాక్ షెడ్యూల్ ని మరి కొద్ది రోజుల్లో పూర్తి చేసుకొని త్వరలోనే ఈ చిత్ర టీం ఇండియాకి తిరిగి రానుంది. ఈ రోజుతో గత కొద్ది రోజులుగా పట్టాయలో జరుగుతున్న చిన్నపాటి షెడ్యూల్ ముగియనుంది. హన్సిక, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ లు కూడా ఈ షూటింగ్లో పాలుపంచుకుంటున్నారు. రావీనా టాండన్, ప్రణితలు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే విడుదల చేస్తారు.