‘కింగ్’నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ‘బాయ్’. ఈ సినిమా శాటిలైట్ హక్కులని ఎంటర్టైనింగ్ చానల్ జీటీవీ సొంతం చేసుకుంది. ఈ శాటిలైట్ రైట్స్ ని ఈ చానల్ రూ. 6 కోట్ల చెల్లించనుంది. నాగార్జున ఇప్పటి వరకు నటించిన ఏ సినిమాకి కూడా ఇంత అమౌంట్ రాలేదు. మరోక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని నాగార్జున నిర్మాత కాబట్టి ఈ సినిమా పూర్తి రైట్స్ ని తన సొంత చానల్ మాటీవీకి ఇస్తారని అందరు అనుకున్నారు. ఈ సినిమా హక్కులను వేరే చానల్ వారు కొనడంతో నాగార్జున ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా వున్నాడు. వీరభద్రం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోను సూద్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.