చివరి షెడ్యూల్లో ఏమో గుర్రం ఎగురావచ్చు

Emo-Gurram-Eguravachu

సుమంత్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’ ఆఖరి షెడ్యూల్ ప్రధాన తారాగణంనడుమ రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. పింకీ సావిక అనే థాయ్ నటీమణి ఈ సినిమాలో సుమంత్ కు జోడీకట్టనుంది. చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు పి. మదన్ నిర్మాత. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఈ సినిమాలో హీరోయిన్ అయిన నీలవేణి అమెరికాలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అన్ని పనులూ పద్దతిగా జరగాలి అని అనుకునే వ్యక్తి. పెళ్లి విషయానికి వచ్చేసరికి తనకు కాబోయే వరుడికి కొన్ని లక్షణాలు వుండాలని అనుకుంటుంది. మరి ఆ లక్షణాలకు తగ్గ వరుడు తనకు దొరికాడా లేదా అన్నదే ఈ సినిమా నేపధ్యం” అని అన్నారు. ప్రస్తుతం హీరో హీరోయిన్ల నడుమ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ‘మర్యాద రామన్న’ సినిమాకు కధను అందించిన కాంచి స్క్రిప్ట్ పనులు చూస్తున్నారు

Exit mobile version