‘అత్తారింటికి దారేది’ సినిమాలో నటిస్తున్న సమంత త్రివిక్రమ్ మాయాజాలానికి ముగ్దురాలైంది. గత 10సంవత్సరాలుగా తన మార్కు డైలాగులతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న రచయిత మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్
తన గత చిత్రాల లాగానే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కుడా త్రివిక్రమ్ మార్కు డైలాగులు పేలనున్నాయి. వాటికి ఇప్పుడు సమంత రూపంలో కొత్త అభిమాని దొరికింది. “పవన్ – త్రివిక్రమ్ సినిమా ట్యాగ్ లైన్ – మాటలతో మాయ …త్రివిక్రమ్ అంటే నాకు గౌరవం ” అని ట్వీట్ చేసింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఒక పాట మరియు పలు సన్నివేశాలు మినహా టాకీ పార్ట్ పూర్తయింది. పవన్ కళ్యాన్ సరసన సమంత మరియు ప్రణీత నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఆగష్టు 7న విడుదలకానుంది.