గత కొద్ది నెలలుగా గౌతం మీనన్ కి గడ్డుకాలం నడుస్తుందని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ అధినేత ఎల్రేడ్ కుమార్ గౌతం పై కేసు వేసిన తర్వాత అతని బ్యానర్ లో సినిమా చెయ్యాలి తర్వాతే వేరే మూవీ చెయ్యాలనడంతో గౌతం మీనన్ సూర్యతో అనుకున్న ప్రాజెక్ట్ ఇక లేనట్లే అని అనుకున్నారు. కానీ గౌతం అందరినీ ఆశ్చర్య పరుస్తూ సూర్యతో సినిమా అధికారికంగా అనౌన్స్ చేసాడు. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా షూటింగ్ జూన్ 15 నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ మొదలు కాలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎల్రేడ్ కుమార్ తో ఉన్న సమస్యల వల్ల ఈ సినిమా వాయిదా పడిందని అలాగే సూర్య కూడా లింగు స్వామి మూవీకి డేట్స్ ఇచ్చాడని అంటున్నారు.
కానీ గౌతం మీనన్ ఈ వార్తల్ని కొట్టి పారేశారు. ‘ సూర్య ప్రాజెక్ట్ ట్రాక్ మీదుంది. నా గురించి ఊరికే రూమర్స్ రాయకండి, అలాగే రూమర్స్ నమ్మకండి. సూర్య – నా కాంబినేషన్లో వస్తున్న ఓ మంచి తమిళ్ మూవీ అని’ గౌతమ్ మీనన్ ట్వీట్ చేసాడు. ‘ధృవ నక్షత్రం’ అని టైటిల్ పెట్టిన ఈ సినిమా తెలుగులో కూడా రానుంది. ఈ సినిమాలో సూర్య సరసన త్రిష నటించనుందని గతంలో వార్తలొచ్చాయి కానీ వాస్తవానికైతే గౌతం మీనన్ ఇంకా హీరోయిన్ అన్వేషణలో ఉన్నాడు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మార్క్ కొనిన్క్స్ సినిమాటోగ్రాఫర్.