అంతకుముందు ఆతరువాత సినిమా నాలో ఆత్మవిశ్వాసాన్నినింపింది – సుమంత్ అశ్విన్

Sumanth_Ashwin

‘అంతకుముందు ఆతరువాత ‘ సినిమాలో ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఈ సినిమాలో హీరోకాగా,ఈషా తెలుగు తెరకు హీరొయిన్ గా పరిచయం కానుంది. ‘అష్టా చమ్మా’,’గోల్కొండా హై స్కూల్’ వంటి సినిమాలు తీసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాకు నిర్మాత. కె.ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాత. ఆయన మాట్లాడుతూ “ముందుగ ఈ సినిమాకు కొత్తవాళ్ళను తీసుకుందాం అనుకున్నాం. కానీ ‘తూనీగ తూనీగ’ సినిమా చూసాక అశ్విన్ ను హీరోగా ఖరారు చేసాం. అతను కష్టపడి నటించడంవల్లే ఈ సినిమా ఇంత బాగా రూపుదిద్దుకుందని” తెలిపారు.

సుమంత్ అంతకుముందు ఆ తరువాత చీనెమ బృందాన్ని అభినందిస్తూ ” ”తూనీగ తూనీగ” చేస్తున్న కాలంలోనే ఈ సినిమాపై అభిమానాన్ని పెంచుకున్నాను. ఈ కధలో ఉన్న బలం వలన నేను నటుడిగా మరింత ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకున్నాను. ఈ సినిమాలో నటించాక నా జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను కూదా ఎదుర్కోగలను అన్న నమ్మకాన్ని సంపాదించుకున్నాను. ఈ సినిమాలో ప్రేమ, స్నేహం, కుటుంబ సంభంధాలను అందంగా చూపించారు. మరికొంతమంది దర్శకులను కలిసాను. నా తదుపరి సినిమాలను త్వరలోనే వెల్లడిస్తాను” అని అన్నాడు.

Exit mobile version