వాయిదాపడ్డ ‘ఎవడు’ ఆడియో

Yevadu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో విడుదలను జూలై 1కి వాయిదా వేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాని జూలై 30 ఆదివారం రోజున విడుదల చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా జూలై 1 సోమవారం రోజున విడుదల చేయనున్నారు. ఈ ఫంక్షన్ ని మెగా ఫ్యామిలీ హాజరు కానున్నారని సమాచారం. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జూలై చివరి వారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కనుందని సమాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనున్నారు.

Exit mobile version