‘నరసింహ’కి సీక్వెల్.. ట్విస్ట్ ఇచ్చిన సూపర్ స్టార్!

Rajinikanth's-Narasimha

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో దర్శకుడు కే ఎస్ రవికుమార్ తో చేసిన క్లాసిక్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రం నరసింహ కూడా ఒకటి. మరి ఈ సినిమా రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా తమిళ్ వెర్షన్ గ్రాండ్ గా రీరిలీజ్ కి రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఒక అరగంట పైగానే ఉన్న స్పెషల్ వీడియోని మేకర్స్ విడుదల చేయగా ఇందులో ఓ క్రేజీ డీటెయిల్ ని రజినీకాంత్ అందించారు.

దీనితో నరసింహ సినిమాకి సీక్వెల్ ని తాను కన్ఫర్మ్ చేశారు. పడయప్ప 2 కి తాము ‘నీలాంబరి’గా టైటిల్ లాక్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కథ డిస్కషన్స్ జరుగుతున్నాయి అని తెలిపారు. సో ఈసారి రమ్యకృష్ణ వెర్షన్ లో ఎలా ఉంటుందో లేక ఇంకా వేరే కొత్తగా ఏమన్నా ప్లాన్ చేసారా అనేది వేచి చూడాల్సిందే మరి. ఇక ఫస్ట్ సినిమా ఈ డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version