గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అఖండ 2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన బీజీఎం పై చిత్ర యూనిట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పోస్ట్ చేశారు. ‘అఖండ 2’లోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ పూర్తయ్యిందని మేకర్స్ వెల్లడించారు. ఈ క్రమంలో ఈ చిత్ర బీజీఎం వర్క్ ప్రేక్షకులకు మాంచి హై ఇస్తుందని చిత్ర యూనిట్ ఈ సందర్భంగా తెలిపింది.
ఇక ఈ మిక్సింగ్, రికార్డుల కోసం థమన్ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు రాలేదని తెలుస్తోంది. సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్‌గా నటస్తుండగా ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
